నేను బ్రతికున్నా చనిపోయినట్లే!

ఎడారిలాంటి నా జీవితంలోకి ఓ అలలా చొచ్చుకు వచ్చిన నా దేవత విశిత. మా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది! కేవలం 3 రోజుల మా పరిచయం మా రెండు మనసులను ఏకం చేసేసింది. దగ్గర అయ్యామనే మాటే కానీ, ఒకరి మనసులో మాట ఇంకొకరికి చెప్పుకోకుండానే మా బంధాన్ని కొనసాగించాం. మేము ఇద్దరం లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని ఇంకా ఏవేవో కలలు కన్నాను. రోజూ గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం. తను నాతో ఒక్క క్షణం మాట్లాడకపోయినా మనసంతా గందరగోళం అయ్యేది. కాలం గడిచే కొద్దీ రోజురోజుకు మా మధ్య దూరం పెరగసాగింది. ప్రతి రోజూ కాల్ చేసే నా దేవత నాతో మాట్లాడ్డం తగ్గించేసింది.

ఇక ఆగలేక ఒకరోజు కాల్ చేసి గట్టిగా అడిగా తనని. అప్పుడు తను చెప్పిన సమాధానం ‘ఇంకెప్పుడూ నాకు కాల్ చేయకు. నువ్వంటే నాకు ఇష్టం లేదు.’ అని కాల్ కట్ చేసింది. ఆ క్షణం నా గుండె చప్పుడు ఆగిపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత నేను ఎన్ని సార్లు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా తన నుంచి మాత్రం ఏ సమాధానం వచ్చేది కాదు. రోజు రోజుకు నాలో ఏదో తెలియని గుబులు. ఒక్కొక్కసారి చనిపోవాలనిపించేది. ఒకటి రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్‌ చేశా. కానీ, ఆ దేవుడికి నామీద దయలేదనుకుంటా! నేను చనిపోవాలనుకున్న ప్రతీసారి నా చావుని ఆ దేవుడు ఏదో ఒక విధంగా అడ్డుకుంటూనే ఉన్నాడు.

నా దేవత ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా తనే నా మదిలో మెదిలేదీ. ఒకప్పుడు తను నా పక్కన ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకున్నా. కానీ,  ఈ రోజు ప్రతీ క్షణం, ప్రతీ నిమిషం చస్తూ బ్రతికేస్తున్నా. ఒక విధంగా చెప్పాలంటే నేను బ్రతికి ఉన్నా చనిపోయినట్లే. నా కలలు అన్నీ కల్లలు చేసి, నా హృదయాన్ని సైతం ముక్కలు చేసేసి వెళ్లిపోయిన నా దేవత మీద నాకు కొంచెం కూడా కోపం లేదు. ఎందుకంటే తను నా ప్రాణం! తను నాతో లేకపోయినా తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటే చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© Copyright 2015. All Rights Reserved. AsrSoftTech |